FbTelugu

నేడు తెలంగాణకు శుభప్రదమైన రోజు : రేవంత్ రెడ్డి

నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన శుభప్రదమైన రోజు అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని, అలాగే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేసిన రోజు కావడంతో ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్టర్ లో పలు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఎప్పుటికీ ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలని తెలంగాణ ప్రజలతో పాటు నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రతిఫలించిన రోజున సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.