FbTelugu

ఇవ్వాళ దిల్ రాజు వివాహం

నిజామాబాద్‌: వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో ఆదివారం రాత్రి టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు వివాహం చేసుకోనున్నారు. ప‌దిమంది లోపు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో దిల్‌రాజు పెళ్లి తంతు పూర్తి కానున్నది.

ఆయన భార్య 2017ay అనారోగ్యం బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. మళ్ళీ రెండోసారి వివాహం చేసుకుంటున్నారు. గ‌త కొంత‌కాలంగా వ్య‌క్తిగ‌త జీవితం కూడా అంత గొప్ప‌గా లేద‌న్న దిల్‌రాజు, మళ్లీ వివాహం చేసుకోవడానికే నిర్ణయం తీసుకున్నారు. త్వ‌ర‌లోనే అంతా స‌ర్దుకుంటుంద‌న్న ఆశాభావాన్ని దిల్‌రాజు వ్య‌క్తం చేశారు. కొత్త మ‌లుపుతో వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవాలంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

You might also like