FbTelugu

నేడు, రేపు తెలంగాణలో ఉరుములతో వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి నుంచి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించడంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.

అది ఇవాళ వాయుగుండగా మారే సూచనలున్నాయని అంటున్నారు. మరింతగా బలపడి సోమవారం నాటికి తుఫానుగా మారుతుందని, ఆ తరువాత తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. వాయువ్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.