FbTelugu

నేడు ఏసీబీ ముందుకు అదనపు కలెక్టర్

హైదరాబాద్: కోట్ల రూపాయల లంచం కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న మెదక్ జిల్లా మాజీ అదనపు కలెక్టర్ నగేష్ తో పాటు మరో నలుగురిని ఇవాళ ఏసీబీ అదుపులోకి తీసుకోనున్నది.

నగేష్ తో పాటు వసీమ్, ఆర్డీఓ అరుణా రెడ్డి, అబ్దుల్ సత్తార్ లను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఒక భూమికి సంబంధించి సెటిల్ మెంట్ వ్యవహారంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ అరుణా రెడ్డి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వీరు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది.

ఇప్పటికే ఈ కేసులో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ అరుణా రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సీఎం కేసీఆర్ స్వంత జిల్లా కావడంతో ఈ కేసును ఏసీబీ అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.