FbTelugu

కనిగిరిలో పొగాకు రైతుల ధర్నా

ప్రకాశం: కనిగిరిలో పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. తమకు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ పొగాకు వేలం కేంద్రాన్ని నిలిపివేశారు. అనంతరం వేలం కేంద్ర ఎదుటే ధర్నాకు దిగారు.

తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. కష్టకాలంలో ఉన్న తమ యొక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

You might also like