FbTelugu

పంచాయతీ తీర్పు పై డివిజన్ బెంచ్ కు

అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది.
ప్రజారోగ్యం, వ్యాక్సినేషన్ ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతో ఎన్నికల షెడ్యూలును నిలిపివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. విచారణకు స్వీకరించిన సింగిల్ బెంచ్ పై విధంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలని నిర్ణయించింది. తీర్పు కాపీ వచ్చిన మరుక్షణమే అప్పీల్ చేసింది. సంక్రాంతి వరుస సెలవుల నేపథ్యంలో అత్యవసర పిటీషన్ గా భావించి విచారించాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది డివిజన్ బెంచ్ ను కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.