FbTelugu

మే నెల వందశాతం జీతం చెల్లించాలి: ఏపీ

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు మే నెల కు సంబంధించి పూర్తి వేతనాల చెల్లింపునకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మే నెలకు చెందిన జీతాన్నీ వందశాతం జూన్ 1 తేదీన చెల్లించనున్నట్టు ఆర్ధిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వేతనాల చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ట్రెజరీ, సీఎఫ్ఎంఎస్ కు ఆదేశాలు పంపించింది. కరోనా కారణంగా ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోతలు విధించిన విషయం తెలిసిందే. అఖిల భారత సర్వీసు అధికారులకు 60, వంద శాతం ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధిస్తూ జీఓ జారీ చేశారు. అయితే ఉద్యోగులకు మాత్రమే వంద శాతం చెల్లించాలంటూ తాజాగా ప్రభత్వం ఆదేశాలు ఇచ్చింది.

You might also like