FbTelugu

ప్రత్యేక విమానాల్లో సొంత దేశాలకు

బెంగళూరు: లాక్ డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో పలు దేశాలకు చెందిన వారు ఇక్కడ చిక్కుకుపోయారు.

పలు దేశాల వినతి మేరకు ఆ దేశాల పౌరులను ఇవాళ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో పంపించారు. వీరిలో 3 వేల మందిని వారి దేశాలకు పంపించినట్టు అధికారులు తెలిపారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి మొత్తం 22 విమానాల ద్వారా 17 దేశాలకు విదేశీయులను తరలించినట్టు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.

విదేశీయులతో కూడిన తొలి విమానం మార్చి 31న జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు వెళ్లిందని అధికారులు తెలిపారు. ఈ విమానంలో వెళ్లినవారిలో ఎక్కువ మంది టోక్యోకు చెందినవారు ఉన్నారని చెప్పారు. లండన్, మాలె, మస్కట్, దోహా, కొలంబో, కైరో, బాగ్దాద్, అజర్బైజాన్, ఇంచేన్, రోమ్, స్టాక్ హోమ్, రియాద్, పారిస్, పరొ తదితర నగరాలకు విమానాలు వెళ్లాయని తెలిపారు.

You might also like