సిద్దిపేటను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ జిల్లాలో విశ్రాంత ఉద్యోగుల భవనాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర కీలకమైనదన్నారు.
గజ్వేల్ లో విశ్రాంత ఉద్యోగుల భవనాన్ని ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 21 నుంచి ప్రతి గల్లీలో హరితహారం మొక్కలను నాటాలని సూచించారు.