FbTelugu

పెద్ద కుటుంబం యజమాని చనిపోలేదు…

ఐజ్వాల్: అతి పెద్ద కుటుంబానికి యజమాని అయిన జియాన్ ఘాకా మరణంపై సందిగ్ధత నెలకొంది. చనిపోయాడని వైద్యులు చెబుతుండగా, ఇంకా నాడి కొట్టుకుంటున్నదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఆయన ఇంకా జీవించి ఉండడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. జియాన్ (76) స్థానిక లాల్పా కోహ్రాన్ ధర్ తెగకు అధిపతి గా ఉన్నాడు. ఆయనకు 39 మంది భార్యలు, 90 మందికి పైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. బిపి, షుగర్ తో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించినట్లు ట్రినిటీ హాస్పిటల్ ప్రకటించింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించడం లేదు. ఆ తెగ కార్యదర్శ జతిన్ ఖుమా కూడా వైద్యులతో ఏకీభవించడం లేదు. ఆయన పూర్తిగా మరణించారని భావించే వరకు అంత్యక్రియలు నిర్వహించమని చెప్పారు. జియాన్ వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జియాన్ మృతిపై మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగా కూడా సంతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.