చెన్నై: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి పళని స్వామి ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ పై వేటు వేశారు.
ప్రతిరోజు వందల్లో కొత్త కేసులు నమోదవుతుండటంతో.. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 38 వేలకు పెరిగిన దృష్ట్యా తమిళనాడు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య సెక్రటరీగా ఉన్న జే.రాధాకృష్ణన్‌ను వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బీలా రాజేష్‌ను వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎన్ వెంకటేషన్ కుమార్తె బీలా రాజేష్.