FbTelugu

ఆ పెళ్లి చెల్లదు.. ఎంపి స్టేట్ మెంట్

కొలకతా: వ్యాపారవేత్త నిఖిల్ జైన్ తో టర్కీ లో తనకు జరిగిన వివాహం చట్టప్రకారం చెల్లుబాటు కాదని టిఎంసి ఎంపి, నటీమణి నుస్రత్ జహాన్ స్పష్టం చేశారు. ఆయన నుంచి ఎప్పుడో విడిపోయానని ఆమె ప్రకటించారు.

తామిద్దరిదీ చట్టప్రకారం వివాహం జరగలేదని, సహజీవనం కిందకు వస్తుందని ఆమె తెలిపారు. కావున అతనికి విడాకులు ఇవ్వాల్సిన అవసరమే లేదన్నారు. టర్కీ వివాహ చట్టం ప్రకారం విదేశాల్లో ఉండి పెళ్లి చేసుకుంటే అది చెల్లుబాటు కాదన్నారు. మాది మతాంతర వివాహం కావున భారత్ లో ప్రత్యేక వివాహ చట్టం కింద అనుమతి అవసరం అన్నారు. అనుమతి తీసుకోనందున సహజీవనం కిందకు వస్తుందని అన్నారు. వాస్తవానికి నిఖిల్ జైన్ తో ఎప్పుడో విడిపోయానని ఆమె వివరించారు. నాకు సంబంధం లేని వ్యక్తుల గురించి, నా వ్యక్తిగత జీవితం గురించి ఇకపై మాట్లాడబోనని నుస్రత్ స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.