FbTelugu

కరోనాతో టీఎంసీ ఎమ్మెల్యే మృతి

సీఎం మమతా బెనర్జీ తీవ్ర విచారం

కొలకత్తా: టీఎంసీ ఎమ్మెల్యే తమోనోష్ ఘోష్ కరోనా సోకి మృతి చెందారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.
ఘోష్ పార్టీ కోశాధికారిగా 1998 నుంచి పనిచేస్తున్నారు. ఫాల్తా నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించారు.

తమోనాష్ ఘోష్ మృతిపట్ల సీఎం మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తమది 35 ఏళ్ల అనుబంధం అని, పార్టీ పురోభివృద్ధి కోసం ఆయన శ్రమించారని ఆమె కొనియాడారు. ఆయన మృతి పట్ల భార్య జార్నా, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు సంతాపం ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.