FbTelugu

వ్యాక్సిన్ల ఎగుమతి పైనే మోదీ శ్రద్ధ: యశ్వంత్ సిన్హా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట విదేశాల్లో వెలిగిపోతున్నదని, భారతదేశంలో మాత్రం ప్రజలు వ్యాక్సిన్ కోసం పడిగాపులు గాస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి, టిఎంసి నేత యశ్వంత్ సిన్హా ఆరోపించారు.
భారతదేశంలో తక్కువ వ్యాక్సిన్లు పంపిణీ చేసి, విదేశాలకు ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్లను ఎగుమతి చేశారని ఆయన విమర్శించారు. నరేంద్ర మోదీ విధానాలపై ఆయన ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. పది సెకన్ల వీడియో ప్రధాని మోదీ భండారాన్ని బయటపెట్టింది. ఇండియా తన దేశ ప్రజలకు ఇచ్చినదాని కన్నా భారీగా వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసిందని ఐక్యరాజ్య సమితి లో భారత రాయబారి సగర్వంగా చెప్పారు.

మోదీ ఇప్పుడు భారత నేత కాదు నిజంగా ప్రపంచ నేత. ఇండియన్లు ఎట్లా కొట్టుకుపోయినా బాధ లేదు అని యశ్వంత్ విమర్శించారు. ఈ కామెంట్ కు ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ఈ ఏడాది మార్చి నెలలో భారత రాయబారి నాగరాజ నాయుడు చేసిన ప్రసంగం క్లిప్ ను యాడ్ చేశారు. ఇండియాలో ఇచ్చిన వ్యాక్సిన్ల కన్నా భారీగా విదేశాలకు ఎగుమతి చేసినట్లు రాయబారి ఆ సమావేశంలో వెల్లడించినట్లు కనిపిస్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కరోనా వ్యాక్సిన్ల పంపిణీ విధానాన్ని విమర్శిస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లు అంటించిన 17 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా హింసించారు. ఈ అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, టిఎంపి ఎంపి మోహువా మోయిత్రా ట్విటర్ వేదికగా మోదీని విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.