FbTelugu

భారీ మరణాలతో గ్రామం సీజ్

చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోని రోహ్ తక్ జిల్లా టిటోలి గ్రామంలో ఊహించని విధంగా 28 మంది మృత్యువాత పడ్డారు. వారిలో యువకులు కూడా ఉండడంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ గ్రామాన్ని సీజ్ చేసింది.

చనిపోవడానికి ముందు ఇద్దరు యువకుల్లో తీవ్ర జ్వరం రావడం, రుచి లేని లక్షణాలు కన్పించాయి. కరోనా కారణంగానే గ్రామంలో 28 మంది మరణించినట్లు జిల్లా అధికారులు ఒక నిర్థారణ కు వచ్చారు. గ్రామంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. బయటి కు వెళ్లనివ్వకుండా పెద్ద ఎత్తున పోలీసులు పహారా కాస్తున్నారు. బుధవారం నాడు గ్రామంలో కొందరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 21 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ లెక్కన గ్రామంలో 25 శాతానికి పైగా కరోనా సోకిన వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తరువాతే జిల్లా యంత్రాంగం ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.