FbTelugu

ఆధిక్యంలో తిరుపతి వైసిపి అభ్యర్థి

తిరుపతి: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైసిపి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం దిశగా దూసుకు వెళ్తోంది. ప్యత్యర్థి పార్టీ టిడిపి కి అందనంత దూరంలో మెజారిటీ దిశగా ఉండడంతో గెలుపు దాదాపు ఖాయంగానే కన్పిస్తున్నది.

ఏడవ రౌండ్ లో వైసిపి అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి కి 62,029 ఓట్లు, టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మీ 32,669 ఓట్లు, బిజెపి అభ్యర్థి కె.రత్నప్రభ కు 4,936 ఓట్లు వచ్చాయి. ఎనిమిదవ రౌండ్ లో వైసిపి అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి కి 66,958 ఓట్లు, టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మీ 34,561 ఓట్లు, బిజెపి అభ్యర్థి కె.రత్నప్రభ కు 5,117 ఓట్లు వచ్చాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.