FbTelugu

జగన్ కలిసిన తిరుపతి ఎంపి గురుమూర్తి

అమరావతి: తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంపి గా గెలుపొందిన వైసిపి అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో 2,71,592 ఓట్ల మెజార్టీని సాధించి ఘన విజయం సాధించిన గురుమూర్తిని, పార్టీ నేతలను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ నేతలు భూమన అభినయ్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి, ఎంఆర్‌సి. రెడ్డి ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.