FbTelugu

తిరుమల మూసివేతపై అసత్య ప్రచారం?

తిరుమల: జూన్ 30వ తేదీ వరకు తిరుమల ఆలయం మూసివేయడం లేదని టీటీడీ ప్రకటించింది.

టీటీడీ ధర్మ కర్తల మండలితో చర్చించి తిరుమల శ్రీ వారి ఆలయంలో జూన్ 30 వతేదీ దాకా భక్తులకు దర్శనం నిలిపి వేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది.

భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించే విషయం పై ధర్మకర్తల మండలి సరైన సమయంలో తగు నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్యం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.

You might also like