హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలుగా హైదరాబాద్ లో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు విక్రయించడం లేదు. ఇక నుంచి హైదరాబాద్ లో విక్రయించనున్నారు.
లిబర్టీలోని టీటీడీ బాలాజీ భవన్ తో పాటు జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో శనివారం నుంచి విక్రయిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లడ్డూలతో పాటు నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీలను కూడా విక్రయిస్తున్నామని తెలిపింది.