FbTelugu

తిరుమల సమాచారం

తిరుమల: కరోనా మహమ్మారితో తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారి సంఖ్య అమాంతం తగ్గిపోయింది. నిన్న ఏప్రిల్ 30 వ‌ తేదీన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 6,431 మంది మాత్రమే.

శుక్రవారం నాడు స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు రూ.1.40 కోట్లు కాగా, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 3,676 మంది. టిటిడి తిరుపతిలో ప్రతి రోజు ఇస్తున్న సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ నిలిపివేసింది. మున్ముందు భక్తుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, న్యూఢిల్లీ నుంచి భక్తులు పూర్తిగా రావడం మనేశారు. ఏపి, తెలంగాణ నుంచి మాత్రమే వస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.