FbTelugu

31 వరకు దర్శనాలు బంద్

తిరుమల: ఈ నెల 31 వరకు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాలు అనుమతించే అవకాశం లేదు. లాక్ డౌన్ 4.0 నెలాఖరు వరకు ఉండడంతో దర్శనాల రద్దు పొడిగించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో తిరుమలలో దర్శనాల రద్దును కూడా ఈనెల 31వరకు టీటీడీ కొనసాగించనున్నట్లు తెలిసింది. దర్శనాల విషయమై ఒకటి, రెండ్రోజుల్లో అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దర్శనాలను కొనసాగిస్తే భక్తులు భౌతికదూరం పాటించేలా రెండ్రోజుల కిందట క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లలో అధికారులు మార్కింగ్‌ చేయించిన విషయం తెలిసిందే.

You might also like