FbTelugu

వ్యక్తిని బలిగొన్న టిప్పర్ లారీ

ములుగు: బైక్, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని ఏటూరునాగారం వ‌ద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

స్థానిక క‌న్నాయిగూడెం మండ‌లం, గుట్ట‌లగంగారం గ్రామానికి చెందిన కోరం శంక‌ర‌య్య‌ అనే వ్యక్తి బైక్ పై వెళుతుండగా.. వేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శంకరయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.