FbTelugu

ఆ రెండు పెద్దసైజు ప్రాంతీయ పార్టీలే: కేటీఆర్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్ ట్వంటీ-2020 సమ్మిట్ లో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపైన చర్చ జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలేనన్నారు. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలు ఏవీ ప్రస్తుతం లేవన్నారు. బిజెపి, కాంగ్రెస్ లు సైతం పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనన్నారు. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్నున్నా వాటి ఆచరణ అంతా కూడా రాష్ట్రాల్లోనే ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు తన సొంత నిధులు ఇస్తున్నామన్న ఆలోచన మంచిది కాదన్నారు. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్న విషయాన్ని మరువకూడదన్నారు. దీనికి ఉదాహరణగా.. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 72 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి రాష్ట్రానికి కేంద్రం 1లక్షా 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది.

తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే కేంద్రం అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన తాము, ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలను అదేవిధంగా వ్యతిరేకించామన్నారు. గత కొంత కాలంగా జరుగుతూ వస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయన్నారు. రానున్న భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయన్నారు.

మెర్స ర్ గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరాన్ని జీవించడానికి అవకాశం ఉన్న అత్యుత్తమ నగరాల్లో అగ్ర స్థానం కల్పిస్తూ వస్తుంది…భారతదేశాన్ని రెండవ జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే తే హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో తనకు అనుమానం ఉందన్నారు. నీతి అయోగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా, ఇప్పటి దాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More