FbTelugu

కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు

నివేదికలు త్వరగా ఇవ్వాలని కమిటీకి సీఎం ఆదేశం
అమరావతి: వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్‌.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది సున్నా అని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్‌పై హడావిడిగా జీవో జారీ చేసిందని, అయినా అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందని సమావేశంలో చర్చకు వచ్చింది.
గ్రీన్‌ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలని సీఎం అన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల్లానే సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని జగన్ ఆదేశాలిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.