FbTelugu

రామమందిర పరిసరాల్లో టైమ్ క్యాప్సూల్

ప్రస్తుతం నిర్మించతలపెట్టిన అయోధ్య రామ మందిర పరిసరాల్లో ఓ టైమ్ క్యాప్సూల్ ని సుమారు 2000 అడుగుల లోపల పూడ్చి పెట్టనున్నారు. ఈ టైమ్ క్యాప్సూల్ లోపల అయోధ్య రామమందిరానికి సంబంధించిన పూర్తి సమాచారం, కోర్టులో నడిచిన వాదవివాదాలకు సంబదించిన అన్నీ వివరాలను డాక్యూమెంట్స్ రూపంలో పొందుపర్చి భద్రపరచనున్నారు.

వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ 2957వ సంవత్సరం వరకు తీయకూడదంటూ క్యాప్సూల్ పై రాసి పూడ్చనున్నారు. భవిష్యత్తు తరాల్లో మళ్ళీ ఏదైనా వివాదాలు వస్తే.. వీటిని ఆధారంగా ఉపయోగించుకునేలా జాగ్రత్త పరుస్తున్నారు.

You might also like