FbTelugu

గర్భవతిని చేసిన టిక్ టాక్ ఆర్టిస్టు అరెస్టు

అమరావతి: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. టిక్ టాక్ ఆర్టిస్టు ఒకరు బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేశాడు. వదిలించుకునే ప్రయత్నం చేయగా బాలిక కేసు పెట్టడంతో టిక్‌టాక్‌ భార్గవ్ ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకు రిమాండ్ విధించారు. హైదరాబాద్ కు చెందిన భార్గవ్ “ఫన్ బాస్కెట్ ” పేరుతో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు. భారత ప్రభుత్వం టిక్ టాక్ ను నిషేధించడంతో మోజో, రేపోసో వంటి యాప్ లలో ప్రస్తుతం వీడియోలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్గవ్ కు పెందుర్తి కి చెందిన ఓ బాలికకు పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి రోజూ మాట్లాడుకోవడం, కలుసుకోవడం జరుగుతోంది. పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గర్భవతి కావడంతో భార్గవ్ ఆమెను దూరం పెట్టాడం మొదలు పెట్టాడు. తనను మోసం చేశాడని గ్రహించిన బాలిక విశాఖ దిశ పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. బాలిక ఫిర్యాదు మేరకు భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.