FbTelugu

30 నిమిషాల్లోనే టిక్కెట్లు విక్రయం

ఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాలకు మంగళవారం నుంచి నడవనున్న ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్ టిక్కెట్లు 30 నిమిషాల్లో అమ్ముడు పోయాయి.

ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని ప్రకటించారు. రెండు గంటలు ఆలస్యంగా 6 గంటలకు వెబ్ సైట్ పనిచేసింది.

సాయంత్రం 6 గంటలకు సైట్ ప్రారంభం కాగానే, ఢిల్లీ-హౌరా రైలు టిక్కెట్లు కేవలం పది నిమిషాల్లో అన్నీ అమ్ముడయ్యాయి. మిగతా రైళ్లకు 6.30 గంటల వరకు టిక్కెట్లు లభించాయి. రైలు ఎన్ని గంటలు బయలుదేరేది, ఏ సీటు అనే వివరాలను మెస్సేజ్ ద్వారా ఐఆర్ సీటీసీ సమాచారం పంపించింది.

You might also like