FbTelugu

ఆర్టీసి బస్సుల్లో సగం సీట్లకే టికెట్లు

అమరావతి: కరోనా మహమ్మారి సమయంలో కూడా అన్ని సీట్లలో కూర్చునే విధంగా అనుమతించిన ఏపిఎస్ ఆర్టీసి ఇక నుంచి సగం సీట్లలో ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నది.

ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపిఎస్ ఆర్టీసి ఎండి ఆర్పీ ఠాకూర్ అన్ని డిపో మేనేజర్లకు సర్క్యూలర్ జారీ చేశారు. మొత్తం సీట్లలో ప్రయాణీకులను అనుమతించడం మూలంగా కరోనా మరింతగా వ్యాప్తి చేందే ప్రమాదం ఉందని గమనించారు. గత మూడు నాలుగు వారాలుగా పలువురు ఆర్టీసి ఉద్యోగులు కరోనా బారిన పడడమే కాకుండా, మరికొందరు చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు రవాణ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందచేశారు. వీటిని పరిగణనలోకి తీసుని బస్సుల్లో సగం సీట్లలోనే ప్రయాణికులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. సగం సీట్లకే ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునేలా మార్పులు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.