FbTelugu

ఈ నిబంధన ఒప్పుకుంటేనే టిక్కెట్: ఐఆర్‌సీటీసీ

ఢిల్లీ: రైళ్లలో ప్రయాణించాలని అనుకునే వారు ఈ నిబంధనలకు కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. లేదంటే రైల్వే టిక్కెట్ లభించదు.

ఇకనుంచి రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు క్వారంటైన్‌ నిబంధనకు ఒప్పుకుంటేనే టిక్కెట్ జారీ చేస్తారు. కరోనా పాజిటివ్ కేసులు వ్యాప్తిచెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ఈ మేరకు ప్రతి ప్రయాణీకుడు వెబ్‌సైట్‌లో అంగీకారం తెలపాలి.

ఒక వేళ ఈ నిబంధనలకు ఎవరైనా అంగీకారం తెలపలేదంటే టికెట్‌ బుకింగ్‌ అంగీకరించదు. 14న ప్రత్యేక రైలులో బెంగళూరు వెళ్లిన కొందరు క్వారంటైన్‌కు ససేమిరా అనడం, వాగ్వాదానికి దిగారు. సుమారు 50 మంది ప్రయాణీకులు ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చారు. ఇలా పలుచోట్ల నుంచి ఫిర్యాదులు రావడంతో ఐఆర్‌సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

You might also like