FbTelugu

ఉన్నావ్ దోషి భార్యకు టికెట్ రద్దు

లక్నో: ఉన్నావ్ అత్యాచార కేసు దోషి, బిజెపి మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు టికెట్ కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బిజెపి నాయకత్వం వెనక్కి తగ్గింది.
ఉన్నావ్ దోషి భార్యకు పంచాయతీ టికెట్ ఇచ్చారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో బిజెపి నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీంతో వెంటనే ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ప్రజాగ్రహాన్ని చల్లార్చే పని చేసింది. ఈ స్థానానికి కొత్తగా మూడు పేర్లు పంపించాలని ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడిని కోరినట్లు రాష్ట్ర అధ్యక్షుడు సత్యేంద్రదేవ్ సింగ్ తెలిపారు.

బాలికలపై అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో డిసెంబర్ 2019లో ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సెంగర్ కు జీవిత ఖైదు విధించింది. ఆయన జైలు జీవితం అనుభవిస్తుండగా, ఆయన భార్య సంగీతకు పంచాయతీ ఎన్నికల్లో త్రటియ సీటు టికెట్ కేటాయించింది. దీనిపై ప్రతిపక్షాలు బిజెపి నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించడంతో విరమించుకోక తప్పలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.