FbTelugu

అమెరికాలో టిక్ టాక్ తల్లకిందులు

వాషింగ్టన్: కొద్ది రోజుల్లో నిషేధానికి గురయ్యే అవకాశం ఉండడంతో టిక్ టాక్ యాజమాన్యం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నది. ప్రకటనకర్తలకు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు సంబంధిత సంస్థలకు సమాచారం పంపించింది.

ఈ వార్షిక సంవత్సరంలో ప్రకటనల రూపంలో ఒక బిలియన్ డాలర్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కరోనా వైరస్ టిక్ టాక్ అంచనాలను తల్లకిందులు చేసింది. తదనంతర పరిణామాల కారణంగా చాలా దేశాల్లో కార్యకలాపాలు మూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో 45 రోజుల వ్యవధిలో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అమెరికాలో పలు కంపెనీలతో ప్రకటనల పై ఒప్పందాలు కూడా కుదుర్చుకుని అడ్వాన్స్ లు తీసుకున్నది. వీరందరికీ తిరిగి డబ్బులు చెల్లిచాలని నిర్ణయించింది. కుదుర్చుకున్న ఒప్పందాలు కొనసాగించేందుకు ప్రయత్నం చేసేందుకు కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి.

You might also like