FbTelugu

టిక్ టాక్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించారు

ఢిల్లీ: భారత ప్రభుత్వం వేటు వేసిన గంటల వ్యవధిలో యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లు స్పందించాయి. టిక్ టాక్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించాయి.
సోమవారం రాత్రి టిక్ టాక్ తో పాటు మొత్తం 59 చైనీస్ అప్లికేషన్లను కేంద్రం ప్రభుత్వం నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటంచిన గంటల వ్యవధోలోనే గూగుల్, యాపిల్ సంస్థలు వేంగంగా స్పందించాయి. ఇదే అదునైన సమయంగా భావించాయి. ఇక నుంచి టిక్ టాక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది.

ప్రస్తుతం మొబైల్ లో వాడుతున్న యాప్ కూడా క్రమక్రమంగా పనిచేయకుండా పోతుంది. యాప్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తే తప్ప ఆశించిన స్థాయిలో పనిచేయదు. అప్ డేట్ లేకపోవడం మూలంగా ఫోన్లలో ఉన్న యాప్ పనితీరు మందగిస్తుంది. గ్లోబల్ వెబ్ ఇండెక్స్ ప్రకారం ఇండియాలో జూన్ నాటికి 12 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రభుత్వం ముందు తమ వాదనను ఈ రోజు విన్పించనున్నట్లు ఇండియా టిక్ టాక్ హెడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

You might also like