FbTelugu

యువకుని ప్రాణం తీసిన టిక్ టాక్ పిచ్చి

బెంగుళూరు: ప్రస్తుతం యువతలో టిక్ టాక్ పిచ్చి ఎంతలా ముదిరి పోయిందంటే.. టిక్ టాక్ చేస్తూ తమను తాము సెలబ్రిటీలుగా ఊహించుకుంటూ.. అందులో వచ్చే లైకులు, ఫాలోవర్స్ కోసం ఏకంగా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఇలాగే టిక్ టాక్ పిచ్చితో ఓ యువకుడు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. వివరాల్లోకెళితే.. కర్ణాటకలోని హోసూరులో డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు టిక్ టాక్ వీడియో కొత్తగా చేద్దామని బతికున్న చేపను మింగుతూ వీడియో తీశాడు. ఆ చేప గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక నేలకూలాడు దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.

You might also like