FbTelugu

భారీగా పింఛన్ నగదును దోచుకెళ్లిన దుండగులు

గుంటూరు: పింఛను పంపిణీ కోసం నగదును బ్యాంకు నుంచి తీసుకొస్తూ ఉండగా.. సచివాలయ ఉద్యోగి, వలంటీరుపై దాడి చేసి దుండగులు నగదును దోచుకెళ్లిన ఘటన జిల్లాలోని పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

స్థానిక జూలకల్లు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి శివపార్వతి, వలంటీరు బీరవల్లి వెంకటరెడ్డి ఫించన్ పంపిణీ నగదు కోసం బ్యాంకు నుంచి నగదును బైక్ పై తీసుకొస్తూ ఉండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారికాచి ఒక్కసారిగా వారిపై దాడి చేసి రూ.19 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.