విశాఖపట్నం: నగరంలో రియల్టర్ పీఎస్ రాజును కత్తి, డమ్మీ పిస్టల్‌తో బెదిరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రౌడీషీటర్లు సంతోష్, లోవరాజు సంయుక్తంగా రియల్టర్‌ను గదిలో బంధించి రూ.9.60 లక్షలు వసూలు చేశారు.
గతంలో రియల్టర్ పీఎస్ రాజు కారణంగానే అరెస్ట్ అయ్యానంటూ సంతోష్ అతనపై కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే రాజు ను హత్య చేయడానికి లోవరాజు కు సంతోష్ సుపారీ ఇచ్చాడు. వీర నుంచి చాకచక్యంగా తప్పించుకున్న రియల్టర్ రాజు దువ్వాడ పోలీసులను ఆశ్రయించి గోడు చెప్పుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తి, డమ్మీ పిస్టల్, రూ.61 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.