FbTelugu

ఏసీబీకి వలలో ముగ్గురు వీఆర్వోలు

నాగర్‌కర్నూలు: ముగ్గురు వీఆర్వోలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు.
బల్మూరు మండలంలోని ముగ్గురు వీఆర్వోలు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మాజీ సైనికుడికి భూమి అప్పగించేందుకు లంచం ముట్టచెప్పాలని డిమాండ్‌ చేశారు.

వీఆర్వోలు బాలనారాయణ, బుచ్చిరాములు, చిన్నయ్య రూ.5 లక్షలు అడిగారు. అంత మొత్తంలో ఇచ్చుకోలేనని, కొంత ఇచ్చుకుంటానని చెప్పినా విన్పించుకోకపోవడంతో జవాను బాలరాజు ఏసీబీని ఆశ్రయించాడు. తెల్కపల్లి మండలం లక్కారం వద్ద వీఆర్వోలు డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.