FbTelugu

మూడు టైగర్లు ఒకే రోగంతో మృతి

హైద‌రాబాద్‌: నెహ్రూ జులాజిక‌ల్ పార్కులో తెల్ల‌రంగు రాయల్‌ బెంగాల్ టైగ‌ర్ కిర‌ణ్ మృతిచెందింది.

ఎనిమిదేండ్ల కిర‌ణ్ కుడి దవడ భాగంలో ఏర్పడిన నియోప్లాస్టిక్‌ కణితి కార‌ణంగా అనారోగ్యం పాలైంది. గ‌త కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ మ‌ర‌ణించింద‌ని నెహ్రూ జూ అధికారులు తెలిపారు. కిర‌ణ్ నెహ్రూ జూలోనే పుట్టి పెరిగింద‌ని వారు వెల్ల‌డించారు.
గ‌త నెల 29న ప‌రీక్ష‌లు చేయ‌గా కిర‌ణ్ కుడి ద‌వ‌డ‌లో క‌ణితి ఉన్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అప్ప‌టి నుంచి శాస్త్ర‌వేత్త‌‌లు, వైద్యులు పులికి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన పులికి వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వ‌హించారు. కిరణ్‌ తండ్రి బద్రి కూడా నియో ప్లాస్టిక్‌ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిర‌ణ్‌ తాత రుద్ర 12 ఏండ్ల‌ వయసులో ఇదే వ్యాధితో మృతి చెందడం జూ అధికారులను ఆలోచనలో పడేసింది

You might also like