FbTelugu

ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్: ఇవాళ జమ్ము కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకెళితే.. స్థానిక షోపియాన్ జిల్లాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహించాయి.

ఈ క్రమంలో ఇరువైపులనుంచి కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

You might also like