FbTelugu

ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్: ఇవాళ జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లో భారత భద్రతాబలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ లో మరో ఉగ్రవాది తప్పించుకున్నాడని సైనికాధికారులు వెల్లడించారు.

కశ్మీర్ లో గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోని అనేక ప్రాంతాల్లో భద్రతాబలగాలు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

You might also like