FbTelugu

ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్: భద్రతాదళాలు జరిపిన ఎదరు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన ఘటన
జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లా, కంగన్​ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉగ్రముష్కరులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో ఇవాళ ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

ఈ కాల్పులకు జవాన్లు దీటుగా స్పందించారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్​సంస్థకు చెందిన వారని అధికారులు తెలిపారు. వారిలో ఒక ఐఈడీ నిపుణులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

You might also like