FbTelugu

ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్: భద్రతాబలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమైన ఘటన జమ్ము కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. షోపియాన్ జిల్లాలో

ఉగ్రమూకలు ఉన్నారన్న ముందస్తు సమాచారం మేరకు భారత భద్రతాబలగాలు కాల్పులు జరిపాయి. బలగాలు జరిపిన ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారని ప్రకటించారు. వారినుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

You might also like