FbTelugu

చెట్టుకు ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతి

విశాఖపట్నం: మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శనివారం అర్ధరాత్రి  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

ముగ్గురు యువకులు మోటారు సైకిల్ పై వెళుతూ బలంగా చెట్టుకు ఢీ కొట్టారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో మరణించారు.  ఇంకొకరు విశాఖపట్నం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థుల పేర్లు సహాడి వర్షిత్. పాటి అనిల్ కుమార్, రుత్తల సాయి కాగా వీరందరూ 10 వ తరగతి చదువుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.