FbTelugu

ప్రకాశం జిల్లాలో మూడు రోడ్డు ప్రమాదాలు

జిల్లాలోని మద్దిపాడు మండలంలో మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకెళితే.. మండలంలోని సీతారాంపురం దగ్గర ఆటోను లారీ ఢీకొని ఐదుగురికి తీవ్ర గాయాలైనాయి.

మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండ్లపల్లిలో అదుపుతప్పి ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. అదే ప్రాంతంలో ఓ ఆయిల్ ట్యాంకర్ ను ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలైనాయి.

You might also like