FbTelugu

లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

* దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన
* మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ వృద్ధుడు

కృష్ణా : ముందు వెళుతున్న లారీనీ వెనుకనుంచి ఓ కారు ఢీకొన్న ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని
జగ్గయ్యపేట మండలం, గరికపాడు వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కుటుంబం వేములవాడ దైవదర్శనానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా.. స్థానిక గరికపాడు వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఓ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ వృద్ధుడు ఉన్నాడు. మరో ఆరుగురికి తీవ్రగాయాలైనాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా మధిరకు చెందిన వారిగా గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.