FbTelugu

కారు, బస్సు ఢీకొని ముగ్గురు మృతి

పశ్చిమగోదావరి : కారు, బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన జిల్లాలోని దెందులూరు వద్ద జాతీయరహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దెందులూరు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ కారు డివైడర్‌ను క్రాస్ చేసి ఎదురుగా వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.