FbTelugu

కేజీఎఫ్ లో చోరీకి యత్నించి ముగ్గురు మృతి

కర్ణాటకలోని కేజీఎఫ్ ఎంఎం టేనెంట్ జింక్ గనిలో చోరీకి వెళ్లి ముగ్గరు దొంగలు ఊపిరాడక మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న రాత్రి ఎంఎం టేనెంట్ జింక్ గనిలో దొంగతనానికి సొరంగంలోకి ఐదుగురు స్థానికులు దిగారు. శ్వాస ఆడకపోవడంతో గనిలోనే ముగ్గురు మృతి చెందారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి 100 అడుగుల లోతులో ఉన్న రెండు మృత దేహాలను వెలికి తీశారు. మరో మృతదేహం కోసం వెతుకుతున్నట్టు తెలిపారు. మిగిలిన ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. చోరీకి యత్నించిన ఎంఎం టేనెంట్ గని పదేళ్ల నుంచి మూత పడి ఉన్నట్టు తెలిపారు.

You might also like