FbTelugu

ఒక్క పోస్టుతో.. ముగ్గురు మృతి, 60 మందికి గాయాలు

బెంగుళూరు: ఫేస్ బుక్ లో పెట్టిన ఒక్క పోస్టుతో వివాదం చెలరేగి ముగ్గురు మృతి చెంది, 60 మందికి తీవ్ర గాయాలైన ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ ఫేస్‌బుక్‌లో ఓ వర్గానికి వ్యతిరేకంగా ఓ పోస్టు పెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వర్గం వారు ఎమ్మెల్యే అండ చూసుకొనే ఇలా వ్యవహరిస్తున్నాడంటూ.. గడిచిన రాత్రి కావల్‌ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసం వద్దకు జనం భారీగా చేరుకుని వాహనాలకు నిప్పంటించారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులపై కూడా దాడికి దిగడంతో వారిపై పోలీసులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 60 మందికి తీవ్ర గాయాలైనాయి. 110 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

You might also like