FbTelugu

పోలీసు కాల్పుల్లో ముగ్గురు అమాయకుల మృతి

రాయ్‌పూర్: పోలీస్ క్యాంప్ వద్దన్న పాపానికి ప్రజల పై పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు అమాయకులు చనిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది.
బీజాపూర్‌ జిల్లా సెంగార్‌ వద్ద పోలీస్‌ క్యాంపు ఏర్పాటుపై అక్కడి స్థానికులు అభ్యంతరం తెలిపారు. క్యాంపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ గిరిజనులు ఆందోళన చేస్తున్నారు.

పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో ముగ్గురు పౌరులు ప్రాణాలు వదిలారు. ఈ కాల్పుల్లో 15 మంది పౌరులు గాయపడ్డారు. అయితే గ్రామస్థులు మాత్రం 9 మంది మృతి చెందినట్లు ఆరోపించారు. తమపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఆ తర్వాతే ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.