FbTelugu

నిండు కుండలా జంట జలాశయాలు

హైదరాబాద్: ఎగువ ప్రాంతంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు నిండు కుండల్లా జలకళతో కళకళలాడుతున్నాయి.
హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1762 అడుగులకు నీరు చేరింది. గండిపేట పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1784 అడుగులకు చేరుకున్నది.

ఇంకా నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్తగా హిమాయత్ సాగర్ లో మూడు గేట్లను పాక్షికంగా ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సందిగా అధికారులు సూచించారు. ప్రజలు హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల వద్దకు వెళ్లవద్దని మెట్రో వాటర్ సప్లయి బోర్డు ఎం.డి. దాన కిశోర్ కోరారు. జంట జలశయాల్లో నీటి మట్టాలు పూర్తి స్థాయికి చేరుకోవడంతో పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేపట్టేందుకు మెట్రో వాటర్ సప్లయి అండ్ సీవరేజి బోర్డు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ జలాశయం నుంచి 6 ఎంజిడిలు, ఉస్మాన్ సాగర్ నుంచి 12 ఎంజిడిల నీటిని తరలిస్తున్నారు. నీరు పుష్కలంగా ఉండడంతో ఇక నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి 12 ఎంజిడిలు తరలించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.