FbTelugu

ముగ్గురూ చనిపోయారు… రుద్రభూమిలో రోదనలు!

బెంగళూరు: కరోనా వైరస్ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ కన్నీళ్లను మిగుల్చుతోంది. హస్పిటళ్లు, స్మశాన వాటికలు రోదనలతో మిన్నంటుతున్నాయి. బెంగళూరు నగరంలో పాల వ్యాపారి శివు అనే వ్యక్తి రోదనలతో శ్మశాన వాటిక పలువురిని కలచి వేసింది.

కరోనా పాజిటివ్ సోకి తల్లి, అత్త ఇటీవలే చనిపోయారు. రెండు రోజుల క్రితం భార్య కూడా చికిత్స పొందుతూ హాస్పిటల్ లోనే చనిపోయింది. పాలు అమ్మి జీవనం సాగిస్తున్న తన జీవితంలో కరోనా వైరస్ శాపంలా మారిందని రోదించాడు. వైద్యం కోసం పాడి ఆవులను కూడా విక్రయించేందుకు సిద్ధం కాగా ఎవరూ కొనుగోలు చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగ్గా అందక భార్య కూడా చనిపోయిందని, ఇంకా నేను ఎవరి కోసం బతకాలని దిక్కలు పిక్కటిల్లెలా విలపించాడు. మూడు రోజులుగా శ్మశాన వాటికలోనే దహనం చేసేందుకు జాగారం చేస్తున్నానని తెలిపాడు. గురువారం రాత్రి అంత్యక్రియలు జరిపేందుకు అవకాశం రావడంతో దహన సంస్కారాలు ముగించాడు. ఇదీ బెంగళూరు నగరంలోని పరిస్థితి.

You might also like

Leave A Reply

Your email address will not be published.